Tuesday, 3 November 2026

తెలంగాణ తెచ్చే బాధ్యత మాదే: పొన్నం

రాజీనామాలతో సోనియాకు లేఖ : కేకే
హైదరాబాద్‌: తెలంగాణ తెచ్చే బాధ్యత తమదేనని ఎంపీ పొన్నం అన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నామని, రాష్ట్ర విభజనకు మంత్రులు ఎలా చెబితే అలా నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పొన్నం అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్లే ఉద్దేశం లేదని, తెలంగాణ సాధనే లక్ష్యమని ఆయన  అన్నారు. కేకే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల సమావేశం ముగిసింది.రాజీనామా లేఖలతో కూడిన లేఖను సోనియాకు అందజేస్తామని, స్పీకర్‌ పార్మట్‌లోనే రాజీనామాలతో కూడిన లేఖలను పంపుతున్నామని కేకే తెలిపారు. ప్రజల ఆకాంక్ష నెరవేరాలని,బలిదానాలు వృధా కాకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నామని రాజయ్య చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *