తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సారంగపూర్ (జనంసాక్షి ) అక్టోబర్ 01
సారంగాపూర్ మండల లక్ష్మీదేవి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వార్డు మెంబర్,అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుంటాల నర్సయ్య మరియు వారి అనుచరులు 20 మంది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరగా టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే పార్టీ బలంగా ఉండాలని అన్నారు.ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకముందు తేడా పోలిస్తే సరిపోతుందని అన్నారు.కొందరు అభివృద్ధి నిరోధకులు కుల మత వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాల లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు.రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం పచ్చదనం పరిశుభ్రతతో అద్దంలా తయారైందని అన్నారు.గ్రామాలకు పట్టణాల నుండి వలసలు పెరిగాయి అని,ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారని అన్నారు.రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు మిషన్ కాకతీయ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు,రైతు బీమా ద్వారా రైతు ఏ కారణంతో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఐదు లక్షల రూపాయలు జమవుతున్నాయని ఎలాంటి పైరవీలు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అని అన్నారు,దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఎన్నో సంవత్సరాలుగా దళితులు అంటరాని వారిగా చూశారని అలాంటి భావం లేకుండా ఉండడానికి ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి గారు ఈ పథకం తీసుకొచ్చారని అన్నారు.ప్రతి ఒక్క దళిత బిడ్డ ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులు నేర్చుకొని దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.మిషన్ భగీరథ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించింది అని చాలా సంతోషకర విషయం అని,కేంద్రం నుండి 19వేల కోట్లు మిషన్ భగీరథ పథకానికి రావాల్సిన అవశ్యకత ఉందని అన్నారు.కేంద్రం అవార్డు లు ఇస్తూ నిదులు మాత్రం ఇవ్వకపోవడం ఇక్కడి నాయకుల వైఫల్యమే అని అన్నారు.ప్రపంచంలోకెల్లా అత్యధికంగా యువత భారతదేశంలోనే ఉందని యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు మాత్రం వెనుకబడి ఉందని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యువతకు సరైన మార్గ నిర్దేశం లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 1,50,000 ఉద్యోగాలు ఐటి ఇతర ప్రైవేటు లో 12 లక్షల ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుందని ఎద్దేవా అన్నారు.అన్ని వర్గాలకు అండగా ఉంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ముఖ్యమంత్రిగా నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ రాంచందర్ రావు, జడ్పిటిసి మనోహర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేందర్రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి,మండల రైతు బంధు సమితి కన్వీనర్ కొల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సుధాకర్ రావు,నాయకులు మర్రి కంటి మల్లేశం,సాంబారి గంగాధర్,శేకర్,గంగారాజం,భీమా నర్సయ్య,నరసింహుల పల్లే సర్పంచ్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.