తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా గాండ్ల శ్రీనివాస్ నియమకం

తిమ్మాపూర్, అక్టోబర్ 13 (జనం న్యూస్): తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ నియమించినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా మండల కమిటీలు నియమించి కరీంనగర్ జిల్లాలో ఉన్న సమస్యలపై పోరాడుతామని త్వరలో పూర్తి మండల, గ్రామ కమిటీలు కూడా నియమిస్తామని అన్నారు.
నా నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ కి, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్ కి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యం కి, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిగంటి అశ్విన్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.రాజు, తెలంగాణ బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడలు పోగు శ్రీనివాస్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పెంట అజయ్ పటేల్ లకు బీసీ సంఘం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.