కురవి అక్టోబర్-16 (జనం సాక్షి న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ యాదవ మహాసభ మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పోతుల దిలీప్ యాదవ్ ను నియమించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగదు బదిలీ వద్దు యాదవ బంధు ముద్దు
ప్రతి ఇంటికి 10 లక్షలు రావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గొర్రెలు ఓట్ల కోసం ఇస్తారు,మేము బ్రతకటానికి కాదు మేపటానికి స్థలాలేలేవు, అటవిలో గొర్రెలు మేపటానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. రోడ్లమీద గొర్రెలను అడవిలోకి మేపటానికి తీసుకుపోయే క్రమంలో రోడ్లమీద యాక్సిడెంట్ అయి గొర్రెలు చనిపోవడం జరుగుతుంది , గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోతుంది అందుకే మా ఇష్టం వచ్చిన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవటంకోసం10 లక్షలు ఎందుకు ఇవ్వరు? యాదవులు ఏమి పాపం చేశారు, దళిత బందు లాగా మాకు యాదవ బందు ఎందుకు ఇవ్వరు యాదవులు అందరికి 10 లక్షలు దళిత బంధు లాగా యాదవ బందు తక్షణమే ప్రకటించాలి లేకుంటే యాదవులు ఎంత శాంతి కామకులో తిరగ బడితే దొడ్డి కోమరయ్య లాగ పోరాట స్ఫూర్తి మాలో ఉంది అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అయినా అన్నారు. మహబూబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తెలంగాణ యాదవుల మహాసభ రాష్ట్ర ,జిల్లా నాయకులకు, యాదవులకు సంఘ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.యాదవ్ సంఘాలకు ఎప్పటికీ మీ ఎన్నంటూ తోడుంటానని యాదవ్ సంఘానికి బాలోపేతం కోసం నా వంతు ఎంతో సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయని ఆయన అన్నారు.




