జెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (24):*. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు శనివారం బిజెపి వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ ప్రతాప్ ఆధ్వర్యంలో రెండో విడత ప్రజా గోస – బిజెపి భరోసా బైక్ యాత్రను ఐదవ రోజు ఉమ్మడి గోపాల్ పేట్ మండలంలోనీ నాగపూర్ గ్రామంలో ప్రారంభమై పోలికపాడు ఆముదాల కుంట తండా, బుద్ధారం, ఈ యాత్రకొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకటనలు తప్ప జాబ్ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు మునుగోడు ఎన్నిక కోసం సీఎం గిరిజన బంద్ నాటకమాడుతున్నారని విమర్శించారు వనపర్తి జిల్లాలో రోడ్ల విస్తరణ చేయాలని బిజెపి లీడర్లు దీక్షలకు దిగితే పట్టించుకోని మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పుడు పోలీసుల ను పెట్టి అడ్డగోలుగా ఇండ్లు కూల్చి వేస్తున్నారన్నారు పింఛన్లు అర్హులకు కాకుండా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సూచించిన వారికి పింఛన్ వస్తుందని వారన్నారు రాబోయే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ టీఎంయూ వ్యవస్థాపక బిజెపి నేత అశ్వధామ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, బి కృష్ణ, సబ్బిరెడ్డి వెంకట్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞా రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శులు నారాయణ, మాధవరెడ్డి, రామన్ గౌడ్ , బిజెపి నాయకులు రామన్న వెంకటేశ్వర్ రెడ్డి ,గోపాల్ పేట్ మండల అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కేశవులు, తదితరులు పాల్గొన్నారు
Attachments area




