సికింద్రాబాద్ (జనం సాక్షి ) : సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో 18 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికిన పండితులు, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించరు.. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము అని తెలిపారు..
ఈనెల 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రుల కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి .పర్యావరణ పరిరక్షణ లో భాగంగా 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ కి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో మొండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక , ఆలయ కమిటీ నెంబర్లు పూజారులు పాల్గొన్నారు.




