తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా రాయికోటి నర్సిములు సహాయ కార్యదర్శి గా బురుగు మల్లేష్

జాహిరాబాద్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి )తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా రాయికోటి నర్సిములు సహాయ కార్యదర్శి గా బురుగు మల్లేష్ లను నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య ఈమెయిల్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సిములు మల్లేష్ లు మాట్లాడుతూ తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా సహాయ కార్యదర్శి గా నియమించినందుకు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య అధ్యక్షులు సుతారి రమేష్ టివీవీ మహిళ అధ్యక్షురాలు బొట్ల సుమతి ప్రధాన కార్యదర్శి లలిత లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి పదవులు కల్పించినందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతూ రాష్టంలో ని వికలాంగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనాన్ని ప్రతి వికలాంగునికి అందేలా కృషి చేస్తాం అని తెలిపారు.