తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా కమిటీ సభ్యులు గా కొనింటి నర్సిములు

జహీరాబాద్ అక్టోబర్ 14 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా కమిటీ సభ్యులు గా జహీరాబాద్ మండలం ఖాసింపుర్ గ్రామానికి చెందిన కొనింటి నర్సిములు ను నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య ఈమెయిల్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కె. నర్సిములు మాట్లాడుతూ తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా కమిటీ సభ్యులు గా నియమించినందుకు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య అధ్యక్షులు సుతారి రమేష్ ప్రధాన కార్యదర్శి లలిత మహిళా రాష్ట్ర, అధ్యక్షురాలు బొట్ల సుమతి ప్రధాన కార్యదర్శి వాసీమ, సంగారెడ్డి టి వీవీ అధ్యక్షులు రాయికోటి నర్సిములు లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా కమిట్ సభ్యులు గా నియమించి నందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతూ జిల్లాలోని వికలాంగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనాన్ని జిల్లాలోని ప్రతి వికలాంగునికి అందేలా చూస్తానని తెలిపారు.