ఎల్బీ నగర్ (జనం సాక్షి )యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు(ఉప్పల్ భగయత్ లో) 5 ఎకారాల భూమి, భవనానికి 5 కోట్లు కేటాయించి, సెప్టెంబర్ 17 రోజున విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవానికి 10 లక్షలు సమకూర్చిన సందర్భంగా,
మనముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి తెలంగాణ విశ్వబ్రాహ్మణ మను మయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు క్రిష్ణమాచారి
ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం (తెలంగాణ భవనం) లో ఘనంగా నిర్వహించారు .విశ్వబ్రాహ్మణులకు 5 ఎకారాల భూమి వచ్చే విధంగా, కృషి చేసిన బ్రహ్మశ్రీ సిరికోండ మధుసూదనచారి కి ధన్యవాదములు. సాహిత్య అకాడమీ చైర్మన్ గా గౌరవ బ్రహ్మశ్రీ జూలురు గౌరి శంకర్, తెలంగాణ బి సి కమీషన్ సభ్యులు గౌరవ బ్రహ్మశ్రీ చిట్టనోజు ఉపేంద్ర చారి కి పదవులు కేటాయించి విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డలను గుర్తించిన, కే సి ఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు
ఈ సమావేశంలో రాష్ట్ర మను మయ సంఘం గౌరవ అధ్యక్షులు యర్రవెళ్ళి బాలచారి, ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి విష్ణు చారి, కోశాధికారి తాటికొండ శ్రీరాములు చారి, ప్రచార కార్యదర్శులు మేడోజు శంకరాచారి, వెలకుర్తి చంద్రశేఖరాచారి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పుల్లోజు అశోక్ చారి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి నర్సింహ్మ చారి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్లోజు శ్రీనివాసాచారి, కోశాధికారి చెన్నోజు యాదాచారి ,సంబోజు శ్రీనివాస్ చారి,మేడోజు రామరాజు చారి,పోలోజు జంగాచారి,వడ్ల మల్లేష్ చారి, పాపయ్య చారి,భాలచారి,పడకంటి అంజయ్య చారి,వినోద్ చారి, తదితరులు పాల్గొన్నారు .




