వ్యవసాయ మార్కెట్లో 50 కేజీల బస్తా అమలు చేయాలి

సూర్యాపేట కలెక్టరేట్ (జనంసాక్షి): తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో గత కొన్ని సంవత్సరాల నుండి  హమాలీలుగా పనిచేస్తున్న హమాలీలకు ఇప్పటికీ 65 కేజీల ధాన్యం బస్తా కొనుగోలు విధానం అమలులో ఉందని ,తక్షణమే ఐకెపి సివిల్ సప్లై కేంద్రంలో మాదిరిగా 40 లేదా 50 కేజీల బస్తాల విధానాన్ని అమలు చేయాలని బహుజన కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.గురువారం ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ లో ఏఓను కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామచంద్రు , కార్యదర్శి సిహెచ్ యాదగిరి , మాణిక్యరావు , పరశురాములు , యాదగిరి , నరసయ్య , సైదులు, తదితరులు పాల్గొన్నారు.