తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం.

జనం సాక్షి ఉట్నూర్.
భూమి భక్తి విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ఘనంగా జరిగింది ఉట్నూర్ మండలంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద రజక సంఘం డివిజన్ అధ్యక్షుడు మరికంటి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలో జీవవైవిద్య మేనేజ్మెంట్ జిల్లా కమిటీ సభ్యులు లక్కారం మాజీ సర్పంచ్ మర్సు కోల  తిరుపతి* పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు ఆమె చేసిన పోరాటం ఎంతోమంది ప్రజలకు మహిళలకు ఆదర్శప్రాయమని అన్నారు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు లింగాగౌడ్ కుమ్మరి సంఘం జిల్లా నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ ఆదివాసి సంఘ నాయకుడు గంగాధర్ కాల్వ రవి, సిడాం సోనేరావు సర్పంచ్ ధర్మనాయక్ మాజీ సర్పంచ్ పిట్ల భూమన్న సిద్దుల ధర్మరాజు శ్యామ్లాల్ నాయక్  చీమల స్వామి, ధరణి రాజేష్ బొడ్డు కిరణ్ ఘర్షకుర్తి వెంకటేష్ మరికంటి కిరణ్ కాల్వ సతీష్.నాగుల రాజేశ్వర్,కుంరం దేవరావ్ గంట విజయ్ ,కొలిపాక రాజా శేఖర్. సలం దేవరావ్. రాజేశ్వర్,సిద్ధుల ఉన్నారు
Attachments area