*డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయి – ఆర్టీసి బస్సును ఢీకొట్టిన టూ వీలర్*
*ఇద్దరూ మృతి. ఒకరికి తీవ్రగాయాలు*
ఉండవెల్లి,సెప్టెంబర్ 10(జనంసాక్షి): : డీసిఎం వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన ద్విచక్రవాహనం… ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందగా. మరొక్కరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఇటిక్యాల ఎస్ఐ గోకారి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అయిజకు మండలానికి చెందిన మహేశ్వర్ రెడ్డి,చంద్రకళ , మంజుల ముగ్గురు కలిసి AP21AB2579 ద్విచక్రవాహనంపై శనివారం ఉదయం గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్లే క్రమంలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో గోశాల వద్ద ముందుగా వెళ్లుతున్న ఓ డీసిఎంను ఓవర్ టేక్ చేశారు. అదే సమయంలో వనపర్తి నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసి బస్సును ఢీ కొట్టగా వాహనం నడిపే వ్యక్తి మహేశ్వర్ రెడ్డి తో పాటు చంద్రకళ అనే మహిళ మృతి చెందింది. మరో మహిళ మంజుల గాయపడింది. ఇటిక్యాల ఎస్ఐ గోకారి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన మంజులను వైద్య చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన చంద్రకళ స్వగ్రామం అయిజ, గాయపడిన మంజుల స్వగ్రామం తనగల. వీరిద్దరూ గద్వాల పట్టణంలోని శుభకర హాస్పిటల్ లో ఏఎన్ఎంలు గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి స్వగ్రామం అయిజ మండలం గూడిదొడ్డి గ్రామంమని. తెలిపారు
Attachments area