Monday, 2 November 2026

తెలుగు రాష్టాల్ల్రో ఉత్కంఠ రేపుతున్న బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి28 :  రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్టాల్రకు ఉమ్మడిగా కొనసాగుతున్న అసెంబ్లీ… ఈసారి ఓ ప్రత్యేకతకు వేదిక కాబోతోంది. ఏపీ, తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఒకే రోజు ప్రారంభం కావడం.. రెండు రాష్టాల్ర శాసనసభలను ఉద్దేశించి గవర్నర్‌ వేర్వేరుగా ప్రసంగించడం జరుగుతోంది. తొలుత ఎపి అసెంబ్లీలో తరవాత తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు. గత అనుభవాల దృష్ట్యా ఈ బడ్జెట్‌ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇరు రాష్టాల్ర స్పీకర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. మార్చి 7 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. మార్చి 4న ఇరువురు సభాపతులు భేటీ కావాలని నిర్ణయించారు. ఇరు రాష్టాల్ర సభ్యులకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చర్చించనున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతపై సవిూక్షించనున్నారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ స్పీకర్‌ మధుసూధనచారి అసెంబ్లీ ఏర్పాట్లపై సవిూక్షించారు. మంత్రి హరీష్‌ రావు, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీ రూల్స్‌ కమిటీతో స్పీకర్‌ మధుసూదనాచారి సమావేశమై సభ నిబంధనల రూపకల్పనపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా పాత నిబంధనలే కొనసాగిస్తుండటంతో… బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రూల్స్‌ అమలు చేయాలని చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు పలు ప్రతిపాదనలు స్పీకర్‌ ముందుంచినా అధికార పక్షం నుంచి సరైన సమాధానం రాలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల సమయం ముంచుకొస్తున్న తరుణంలో స్పీకర్ల భేటీపై ఇరు రాష్టాల్ర సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *