తొమ్మిదవ మెయిల్ తండా లో పోషకాహారం పై అవగాహన ర్యాలీ
టేకులపల్లి, సెప్టెంబర్ 12( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని తొమ్మిదవ మైలు తండా గ్రామపంచాయతీ లో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషకాహారం పై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా టేకులపల్లి సెక్టార్ సూపర్వైజర్ కే అనురాధ, అంగన్వాడీ టీచర్లు సంధ్యారాణి, నీరోజా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, యుక్త వయసు బాలికలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు. 9వ మైలుతండాలో భారీ ర్యాలీ తీశారు. రేపటి ఆరోగ్యవంతమైన భారత సమాజం కొరకు ఇప్పటి యుక్త వయసు బాలబాలికలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చక్కటి పోషకాహారం సమయానుకూలంగా అందించాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ ద్వారా పోషకాహారం రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అదనపు పోషకాహారం ఇవ్వాలన్నారు . రక్తహీనతకు చికిత్సను త్వరగా అందించాలని ఈ సందర్భంగా కోరారు.దీని కొరకు వారితో స్నేహపూర్వకంగా ఉంటూ ప్రభుత్వ పరంగా మనం అందించే పోషకాహారంతో పాటు వారి ఇంటిలోనే సొంతంగా ఆరోగ్యవంతమైన పోషకాహారం తయారు చేసుకోవడానికి చక్కటి పోషక విలువలు కలిగిన ఆకుకూరలు ,కాయగూరలు ఇంటిలోనే పెంచుకునే విధంగా ప్రోత్సహించడానికి కావాల్సిన సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పూనం కృష్ణకుమారి, ఉపాధ్యాయురాలు సుజాత ,చెల్లమ్మ మహిళలు పాల్గొన్నారు.