తోటి ఫోటోగ్రాఫర్ కు మేమున్నామంటు భరోసా
మహబూబాబాద్ జిల్లా బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి)
ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్ దారావత్ రవిని తోటి ఫోటోగ్రాఫర్లు మేమున్నమంటు ధైర్యం చెప్పారు. పండ్లు, బ్రెడ్ తో పాటు చిన్నమొత్తంలో ఆర్ధిక సహాయం అందించి భరోసా ఇచ్చారు. రవి కొలుకునేవరకు తన కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ధైర్యం కోల్పోకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి సతీష్, రావూరి ప్రశాంత్, బాణోత్ సైదులు, మూడ్ వీరన్న, బల్లెం దుర్గ, గుగులోత్ వినోద్, అనుగోజు విజయ్ తదితరులు ఉన్నారు.