త్రాగునీటి ట్యాంక్ కు భూమిపూజ….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని చిట్కూల్ గ్రామంలో బుధవారం నాడు త్రాగునీటి ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ చేసిన గ్రామ సర్పంచ్ ఎన్.గోపాల్ రెడ్డి,ఏఈ అన్వేష్ రెడ్డి, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో నీటి సమస్య ఉన్నందున ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో మిషన్ భగీరథ కింద 60,000 వేల లీటర్ల ట్యాంకు నిర్మాణానికి మంజూరు చేయించుకోవడం జరిగింది కావున గ్రామంలోని నాయకుల అందరి సమక్షంలో నూతన మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు ఈకార్యక్రమంలో ఎంపిటిసి సుభాష్ రెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ కే రామచంద్రారెడ్డి ,విలేజ్ సెక్రటరీ తిరుపతి,ఉప సర్పంచ్ బోయిన సుధాకర్,గ్రామ వార్డు మెంబర్లు పోచయ్య,దుర్గయ్య భారతమ్మ మరియు గ్రామ నాయకులు వట్టిపల్లి మహిపాల్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి, అఖిల్ ,వెంకట్ రెడ్డి, బి నాగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు