త్వరలోనే సోనాల మండల ఏర్పాటు
– మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బోథ్ జనంసాక్షి (అక్టోబర్ 07)
భోథ్ మండలం సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సోనాల గ్రామ సాధన కమిటీ ఆధ్వర్యంలో దాదాపు రెండు నెలల నుంచి చేపడుతున్న ఉద్యమాన్ని తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సోనాల మండల సాధన కమిటీ సభ్యులను కలిసి తెలంగాణ ప్రభుత్వం సోనాల మండల ఏర్పాటుకు సానుకూలంగా ఉందని కమిటీ సభ్యులకు తెలియజేశారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు గారి అన్న సోయం మాణిక్ రావు టీచర్ శుక్రవారం ఉదయం ఐదు గంటలకు గన్ పూర్ నాగు గూడ నందు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన అంత్యక్రియలో భాగంగా నాగు గూడ గ్రామానికి వచ్చిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తిరుగు పయనంలో సోనాల మండల సాధన కమిటీ సభ్యులను కలిసి మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు కలిగి ఉన్న సోనాల మండలం కచ్చితంగా సాధ్యమేనని సాధన కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోత్ ఎంపీపీ తుల శ్రీనివాస్ సోనాల మండల సాధన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area