– కర్ణాటక ఎన్నికల్లో విజయంతో అది స్పష్టమైంది
– మోడీ పాలనకు దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు
– కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు ప్రయత్నించాడు
– ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ముసలికన్నీరు కారుస్తున్నాడు
– చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు గమనిస్తున్నారు
– వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు
– తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ శకం ప్రారంభమైనట్లే
– తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, మే15(జనం సాక్షి ) : దక్షిణాదిన బీజేపీని ప్రజలు నమ్మరని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారానికి కర్ణాటక ఎన్నికలు తెరదించాయని, దేశవ్యాప్తంగా మోడీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనతో ఎంత విసిగిపోయారో ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతుందన్నారు. సిద్ధరామయ్య చేసిన అవినీతియే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని విమర్శించారు. అంతేకాక రాహుల్‌గాంధీ ప్రచారం చేసని ప్రతి రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, అందువల్ల ఆ పార్టీ ఒక సారి రాహుల్‌గాంధీ నాయకత్వం గురించి ఆలోచిస్తే మంచిదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగిపోయే ఓడలా ఉందని, అయినప్పటికి తెలంగాణలో తామే ప్రత్యామ్నయంగా నిలుస్తామని కాంగ్రెస్‌నేతలు విర్రవీగడం హాస్యాస్పదం అన్నారు. సర్వేలు, ఎగ్జిట్‌పోల్ ఫలితాలు, విూడియా సంస్థలు అన్ని కూడా తమ పార్టీని తక్కువ చేసి చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజలు మోదీ పాలనను నమ్ముతున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో బాబు తన అనుచరులతో కలిసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారని, కానీ? వారి మాటలను కర్ణాటక తెలుగు ప్రజలు నమ్మలేదన్నాడు. ఇప్పటికైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాబు చేసే గిమ్మిక్కులను గమనించాలని కోరారు. బీజేపీ, మోదీనే ప్రత్యేక ¬దాకు అడ్డు పడుతున్నారని ప్రచారం చేసి చంద్రబాబు ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నాడని, కానీ ప్రజలు ఆయన చేసే అవినీతిని, కుటుంబ పాలనను గమనిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో అందుకు తగ్గ ఫలితాన్ని చవిచూస్తారని తెలిపారు. కర్ణాటక ఫలితాలు చూసైనా
కుటుంబ పాలకులు కనువిప్పాలని, ఎందుకంటే మరో 20 ఏళ్లపాటు దేశానికి మోదీపాలన అవసరమని ప్రజలు భావిస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. కర్ణాటకలో తమ పార్టీ గెలుస్తందని నమ్మకం ఉండటం వల్లే ఎన్నికలకు ముందుగానే యడ్యురప్పని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమన్నారు. ఎవరితోనూ పొత్తు అవసరం లేకుండానే పూర్తి మెజారిటీ సాధించి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, యడ్యురప్ప ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతారని లక్ష్మణ్ పేర్కొన్నారు.




