ఆదిలాబాద్,జూన్13(జనం సాక్షి): దళితులకు భూమి పంపిణీకి సంబంధించి సాగుకు యోగ్యమైన భూములనే కొంటామని జేసీ సంధ్యారాణి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చెల్లించే వీలుందని జేసీ తెలిపారు. అంతకు మించి ధర చెల్లించే అవకాశం తన పరిధిలో లేదన్నారు. వచ్చే వారం ధరపై తుది నిర్ణయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాలని జేసీ రైతులకు సూచించారు. కొందరు రైతులు కూడా భూములు అమ్మడానికి రైతులు మందుకు వచ్చారు. సొనాల గ్రామానికి చెందిన ఐదుగురు లబ్దిదారులు కోటా (కే) శివారులోని 15 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. సంబంధిత భూములను జేసీ సందర్శించారు. లబ్దిదారులు, రైతులతో మాట్లాడారు. ఎకరానికి రూ.ఆరు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు చెల్లించాలని రైతులు కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చెల్లించే వీలుందని జేసీ తెలిపారు. అంతకు మించి ధర చెల్లించే అవకాశం తన పరిధిలో లేదన్నారు.




