దళిత జర్నలిస్టుల పోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కరిగళ్ల సుదర్శన్
బిజినేపల్లి. జనం సాక్షి. అక్టోబర్. 18 : పెబ్బేరు మండలం కేపిటల్ ఇన్ఫర్మేషన్ (ఆంగ్లం దినపత్రిక) రిపోర్టర్ నందీశ్వర్ పై అకారణంగా దాడి చేసిన
కావలి రవి కుమార్ అతని తమ్ముడు శివకోటి ని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత జర్నలిస్టుల ఫోరం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిగళ్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి రవి కుమార్ అనే వ్యక్తి, దళిత జర్నలిస్ట్ నందీశ్వర్ పై
వాట్సాఫ్ లో తప్పుడు పోస్ట్లు రాయడమే కాక సోమవారం ఉదయం దళిత జర్నలిస్ట్ నందీశ్వర్ ను కులం పేరుతో దూషించి దాడి చేశాడని ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు దళితులు జర్నలిస్టులుగా ఉండటానికి జీర్ణించుకోలేకపోతున్నారని దీనికి నిదర్శనం ఈ దాడే కారణమని తెలిపారు. గతంలో కూడా కావలి రవికుమార్ పై పలు ఆరోపణలు ఉన్నాయని ఇట్టి విషయాలు అధికారులకు తెలుసన కూడా అతనిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత జర్నలిస్ట్ పై దాడి చేసిన కావలి రవికుమార్, శివకోటి పైకేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మస్కూరి బంగారయ్య, మహేష్, మాసయ్య, నరసింహ, ప్రకాష్ ,కారుకొండ మిద్దె బంగారయ్య తో పాటు తదితరులు ఉన్నారు




