దళిత ద్రోహి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖబర్దార్.

– అంబేద్కర్ ని అవమానపరిచినందుకు క్షమాపణలు చెప్పాలి.
దుబ్బాక సెప్టెంబర్ 14, ( జనం సాక్షి )
బీజేపీ పార్టీ తమకు రాజ్యాంగం లేదంటే ప్రపంచ దేశాలతో కీర్తింపబడుతున్న ఆ రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఎలాంటి విలువలేదన్నట్టుగా మంగళవారం రోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తన యొక్క మొండి వైఖరిని మరోసారి నిరూపించుకుంది.అభివృద్ధి కి, సమానత్వానికి చాలా దూరంలో ఉన్న దళిత జాతి నుండి పుట్టిన  అంబేద్కర్ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పాటుకు పునాది , అలాంటి మహోన్నత వ్యక్తి కి అసలైన నివాళి కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్లమెంట్ కి అంబేద్కర్ పేరుని పెట్టాలని ప్రతిపాదించిన వెంటనే దీనిపై కనీస చర్చ కూడా చేయకుండా మరోసారి బీజేపీ తన దళిత వ్యతిరేఖ విధానాలని,దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన పార్టీ ఆదేశానుసారం నిండు అసెంబ్లీ నుండి అంబేద్కర్ పేరు వినబడగానే బయటికి వెళ్ళిపోయి మరోసారి తాను అంబేద్కర్ వ్యతిరేకిని అని నిరూపించుకున్నాడు.ఈ హేయమైన చర్యని నేడు రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. దానిలో భాగంగా నేడు దుబ్బాక పట్టణంలో సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది , వెంటనే బీజేపీ మరియు ఎమ్మెల్యే రఘునందన్ తన వైఖరి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలని , అంబేద్కర్ ని అవమానపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయనైనది.
ఈ కార్యక్రమంలో ఆస స్వామి, ఇల్లెందుల శ్రీనివాస్, ఆస యాదగిరి, భీమ సేన, కరికే శ్రీనివాస్ , గుర్రాల శ్రీనివాస్ , జీడిపల్లీ రవి, తౌడ శ్రీనివాస్, కాల్వ నరేష్ , దొమ్మాట భూపాల్ , ఇస్తారిగల్ల స్వామి,తదితరులు పాల్గొన్నారు.
Attachments area