దళిత బంధు కింద మంజూరైన కారును లబ్ధిదారునికి అందజేసిన. – ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.
మర్పల్లి, అక్టోబర్ 07 (జనం సాక్షి) దళిత బంధు పథకం మన దేశానికి ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం రోజున మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన కావలి నర్సింలు కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన షిఫ్టు డిజైర్ కారును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ కూడా లేనీ పథకం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషమని దీని ద్వారా అభివృద్ధి కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. రాచయ్య, కోటమ్మర్పల్లి మాజీ ఉపసర్పంచ్ అశోక్, జైహింద్ రెడ్డి, తహసీన్, ఖదీర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.