దశాబ్ది వనాల స్థలాల పరిశీలన

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 12న దశాబ్ది వనాలు ఏర్పాటు చేయడం కోరకు గురుకుల పాఠశాల నందు స్థలాన్ని మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పాల్గొనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సి.హెచ్ సతీష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పాల్గోన్నారు

తాజావార్తలు