ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకం.. వైయస్ఆర్….డా. సత్యం శ్రీరంగం.
కూకట్ పల్లి సెప్టెంబర్ 02(జనంసాక్షి): జన్మంతా జనం బాగు కోసమే పరితపించిన నిస్వార్థ సేవకుడు తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అన్నారు.శుక్రవారం
మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి సందర్బంగా కూకట్ పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ లో వైయస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి, పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన మహానేత వైయస్సార్ అన్నారు.ఆయన పేదల సంక్షేమమే లక్ష్యంగా తన ఆఖరి శ్వాస వరకు పరితపించిన జన హృదయ నేత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మహానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పుడు నిలిచే ఉంటారని అందుకు నిదర్శనమే వైఎస్ఆర్ అన్నారు. ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, పాద యాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, నిరుపేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్సుమెంటు, రైతులకు రుణ మాఫీ, 108,104, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని దక్కించుకున్నారని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా, ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ గ్రామంలో కోట్ల మంది తెలుగు హృదయాల్లో అలాగే ఉండిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, బంధిగ బాల నరసింహ్మ, మధు గౌడ్, మదారి శ్రీనివాస్, మొహమ్మద్ హుస్సేన్, పుట్టపాక రాము, భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




