కూకట్ పల్లి సెప్టెంబర్ 02 (జనంసాక్షి ):శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ శుక్రవారం ఖైరతాబాద్ లోని శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం చేసుకుని పార్వతీపుత్రుడు అయినా గణనాధునికి హారతి ఇచ్చి ఆశీర్వాదం పొందారు.ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా మోర్చా సభ్యులు రాజేశ్వరి, భారతి,శృతి గౌడ్,విశాల, శాలిని,శార్వాణి గౌడ్,ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న విద్యా కల్పన ఏకాంత్ గౌడ్…




