దుబ్బాక ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్

– కడుపులో నుండి  8 కిలోల  ఓవరియన్ మాస్ గడ్డను  తొలగింపు.
– డాక్టర్  హేమరాజ్ సింగ్
దుబ్బాక 29, జూలై ( జనం సాక్షి )
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రం లోని వంద పడకల ఆసుపత్రిలో మరొక అరుదైన  ఆపరేషన్  చేయడం జరిగింది.వీరిది దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన  కొండ  రాజమని గత రెండు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. రాజమని ని  డాక్టర్ హేమరాజ్ సింగ్  ఆమెను పరీక్షించి అన్ని వైద్య పరీక్షలు  చేసి   కడుపులో  మాస్ ఓవరియన్ సిస్ట్ ఉంది. అని  నిర్ధారణ చేసి శుక్రవారం రోజున  డాక్టర్  హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ నారాయణ మరియు  ఆపరేషన్ థియేటర్ సిబ్బంది  స్టాఫ్ నర్స్ లు  రేణుక ,ధన ,జాన్సీ ,సమక్షంలో  రాజమని కడుపులో నుండి  8 కిలోల  ఓవరియన్ మాస్ గడ్డను  తొలగించడం  జరిగింది.ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.ఈ ఆపరేషన్ ఆరోగ్య శ్రీ పథకం  కింద ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగిందని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్  డాక్టర్  హేమరాజ్ సింగ్ తెలిపారు.