దురాక్రమణ నుంచి మా భూములు మాకు ఇప్పించండి..

ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 31. (జనం సాక్షి). అధికార పార్టీకి చెందిన నాయకుడు తమ భూములను వారసత్వం పేరుతో ఆక్రమించారని తమ భూములు తమకు ఇప్పించాలని కోరుతూ బాధితులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ శివారులో 2005 లో తాము ఫ్లాట్లను కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. ఇప్పుడొచ్చి భూమికి వారసులమంటూ అధికార పార్టీకి చెందిన నేత ఒకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. 9 మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తాము పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు జంగంపల్లి కనకయ్య , బూర మంజుల, వేముల రమేష్ అధికారులను వేడుకుంటున్నారు.

తాజావార్తలు