దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వి టి

 

 

 

 

కొండమల్లేపల్లి అక్టోబర్ 21 జనం సాక్షి: శుక్రవారం పట్టణంలోని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలను ఘనంగా SI బాలకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షుడు NVT, మరియు సభ్యులతో కలిసి ఘనంగా ప్రారంభించినారు, అలాగే వారికి కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ జోహార్లు అర్పించినారు, అనంతరం వారు మాట్లాడుతూ పోలీసుల సేవలు వారి త్యాగాలు మరువలేనివని వారు లేని సమాజం చూడలేమని వారు ఒక్క రోజు లేకున్నా వ్యవస్థ అతలాకుతలం అవుతుందని వారు ప్రజల రక్షణ కోసం 24 గంటలు డ్యూటీ చేస్తూనే ఉంటారని ముఖ్యంగా కరోనా టైంలో వారు చేసిన సేవలు అమోఘమని ఎంతోమంది ప్రాణాలను కోల్పోయినరని ఈ సందర్భంగా వారు అన్నారు కాబట్టి అక్టోబర్ 21వ తేదీన పోలీసులను స్మరించుకోవడం అనేది తప్పనిసరి అని అన్నారు , అనంతరం వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించినారు, ఈ కార్యక్రమంలో SI సతీష్, SI వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ జంపుల, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, జయరాం, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రాజ్ కుమార్ రెడ్డి, టిడిపి పార్లమెంటరీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వసుకుల కృష్ణయ్య ,లక్ష్మణ్, డాన్స్ మాస్టర్ క్రాంతి, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి భాస్కర్, మహేందర్, సలీం, డాన్స్ మాస్టర్ జగన్, ఆర్య, సాయి, నరేష్ మన్ దీఫ్ ,రాము, భాస్కర్ ,సత్యం , దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు