దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

నిర్మల్ బ్యూరో, ఆగస్టు24,జనంసాక్షి,,,   నిర్మల్ పట్టణం దత్తాత్రేయా నగర్లో  రూ. 60 లక్షలతో నూతనంగా పున: నిర్మించనున్న దత్తాత్రేయా మందిర నిర్మాణానికి బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి జడ్పి చైర్మన్ కె.విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్  శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నే ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు నిర్మల్ లో ఎక్కడ చూసినా ఆలయాలే ఉన్నాయని ప్రతీ ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దత్తాత్రేయ నగర్ లో నూతనంగా నిర్మించనున్న హనుమాన్ మందిరానికి నిధులు విడుదల చేస్తానని తెలిపారు. అనంతరం మంత్రిని కాలనీ వాసులు శాలువా మెమెంటో తో సత్కరించారు.