లోక కళ్యాణార్థం గండి రామన్న నుండి కదిలి మహా పాదయాత్ర
పాదయాత్రలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ బ్యూరో,, ఆగస్టు24,,జనంసాక్షి,, గండి రామన్న దత్త సాయి క్షేత్రం నుంచి కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయ వరకు బుధవారం దేవాదాయ శాఖ మంత్రి పాదయాత్ర చేపట్టారు. పట్టణ శివారులోని గండి రామన్న దత్త సాయిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సాయి బాబా ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం గండి రామన్న క్షేత్రం దత్త సాయి మందిరం నుండి భక్తుల బృందంతో ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం కదిలి పాపహరేశ్వర ఆలయం వరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమసమాజంలోని లోక కల్యాణం కోసం ఆరేళ్ళుగా ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం చివరలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కిడి జగన్మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ఈ మహాత్కార్యంలో ఈసారి పాలుపంచుకోవడం ఆ భగవత్ కృపగా భావిస్తున్నానన్నారు. సీయం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీయం కేసీఆర్ సారధ్యంలో పెద్ద ఎత్తున ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని, నిర్మల్ నియోజకవర్గం కూడా ఆధ్మాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ ఈ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.