Thursday, 5 November 2026

దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సాకెట్ ను ప్రవేశపెట్టిన బోల్ట్

ఖైరతాబాద్: సెప్టెంబర్ 27 (జనం సాక్షి)  భారత దేశపు అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్ అయిన బోల్ట్ భారత దేశపు మొట్ట మొదటి సురక్షితమైన యూనివర్సల్ ఈవీ ఛార్జింగ్ సాకెట్ బోల్ట్ లైట్ ని తీసుకొస్తున్నారు. భారత దేశంలోనే తయారైన బోల్ట్ లైట్ సాకెట్ ఏదైనా ఈవీతో వచ్చే అన్ని పోర్టబుల్ ఛార్టర్లకి అనుకూలమైనది. ఇంటి వద్ద ఇప్పటికే ఉన్న ఏసీ పవర్ సప్లైతో పనిచేస్తుంది. బోల్ట్ లైట్ ఛార్జింగ్ సాకెట్లు రూ .2,599 పరిచయ ధరకు అందుబాటులో ఉన్నాయి. 2022 ఆగస్టు నాటికి భారతదేశంలో 13 లక్షలకి పైగా ఈవీలు ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత రెండు సంవత్సరాలు గా  ఆర్ధిక సంవత్సరంలో అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది ఈవీల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. 2030 నాటికి ప్రైవేట్ కార్లలో 30 శాతం, వాణిజ్య వాహనాలలో 70 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలలో 80 శాతం ఈవీ అమ్మకాలని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి భారతదేశంలో ఇళ్లలోనే సురక్షితమైన, స్మార్ట్, సరసమైన ఈవీ ఛార్జింగ్ పరిష్కారాలు అవసరం. ఇంట్లో సురక్షితమైన ఈవీ ఛార్జర్లు ఉండటం వల్ల యూజర్లు తమ ఈవీలని ఛార్జ్ చేసుకునే సౌలభ్యాన్ని పొందడమే కాకుండా వాటిని కొనుగోలు చేయాలనుకునేవారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నివేదికల ప్రకారం 80 శాతం కంటే ఎక్కువ మంది ఈవీ యజమానులు తమ వాహనాలను ఇంటి వద్దనే చార్జ్ చేస్తారు. ఇంట్లో చార్జింగ్ పెట్టుకునేందుకు సౌకర్యం ఎక్కువ, ఖర్చు తక్కువ కావడమే దీనికి కారణాలు. చాలా ఈవీలు ఆన్ – బోర్డ్ ఛార్జర్ తో వస్తాయి. వీటివల్ల వినియోగదారులు తమ వాహనాలను నేరుగా ప్రామాణిక 15 ఏ ఛార్జింగ్ సాకెట్లోకి ప్లగ్ చేయడానికి వీలుంటుంది. అయితే నెమ్మదిగా తక్కువ శక్తి సమర్థవంతంగా ఉండటమే కాకుండా ఈ సాకెట్లు ఎలాంటి ప్రత్యక్ష భద్రత లేదా మానిటరింగ్ ఫీచర్లని అందించవు. దీర్ఘకాలిక ఈవీ ఛార్జింగ్ కోసం ఇవి మంచివి కావు. ప్రామాణిక 15 ఏ సాకెట్ ఉపయోగించి ఇంటి వద్ద అసురక్షిత ఛార్జింగ్ చేయడం వల్ల అకస్మాత్తుగా పవర్ సర్ట్ లు ఏర్పడతాయి. దీని వల్ల ఈవీ బ్యాటరీ దెబ్బతింటుంది. భారత దేశంలో ఈవీ బ్యాటరీలు మంటలు చెలరేగడం, మంటలు సృష్టించడం గురించి వార్తా నివేదికలు ఎక్కువగా బ్యాటరీని సురక్షితంగా ఎలా ఛార్జ్ చేయాలో యజమానికి తెలియకపోవడం వల్ల వచ్చాయి.