Tuesday, 3 November 2026

దేశ వ్యాప్తంగా కాపులందరినీ ఐక్యం చేస్తాం – జాతీయ అధ్యక్షుడు కొండ దేవయ్య

ఖైరతాబాద్ : ఆగస్ట్ 07 (జనం సాక్షి) దేశ వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రజలందరినీ ఏకం చేసేందుకు భారతీయ కాపు ఐక్యవేదిక కృషి చేస్తుందని జాతీయ అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. వేదిక మొట్టమొదటి సమావేశాన్ని ఆదివారం సోమాజిగూడలోని పర్యాటక భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ… ఐక్యవేదికను బలోపేతం చేసేందుకు ఇటీవలే లోగోను ఆవిష్కరించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న కాపు కులస్తులను గుర్తించి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు వేదిక కృషి చేస్తుందని చెప్పారు. త్వరలోనే ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ వేదికలో ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్గా తోట రామ కుమారులును నియమించారు. ఈ సమావేశానికి నాయకులు, ఆర్.టీ.ఐ మాజీ కమిషనర్ విజయబాబు, కస్టమ్స్ ఆఫీసర్ మంగ బాపు, కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం, డాక్టర్ బూరగడ్డ శ్రీనివాస్, కాచిగూడ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ జెల్లీ సిద్దయ్య,టీఎంకెఎఫ్ అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హారి శంకర్, సినియర్ జర్నలిస్టు చందు జనార్ధన్, కాపు సేన తెలంగాణ అధ్యక్షుడు ఏసుబాబు, ఆకుల రమణ మూర్తి, డాక్టర్ చెన్నం శెట్టి విజయ్ కుమార్, సమ్మెట ప్రసాద్, పి.ఎన్.డి ప్రసాద్, డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, పెరుక రమేష్ పటేల్, సంఘం నాయకులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు.