దోనూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ
ధర్మపురి ( జనం సాక్షి )ధర్మపురి మండలంలో ప్రాథమిక పరిషత్ పాఠశాల దోనూరు గ్రామానికి చెందిన నవయుగ యూత్ సభ్యులు 20.వేల రూ. విలువగల స్మార్ట్ టీవీ ని బహుకరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ, పాఠశాలలో బోధన అభ్యసన కార్యక్రమానికి ఈ స్మార్ట్ TV ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తాము మరింత సహకరిస్తామని, ఈ సందర్భంగా పాఠశాల టీచర్స్ కు వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నవయుగ యూత్ సభ్యులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాశెట్టీ రమేష్,ఉపాధ్యాయులు ఎస్. కన్నం నాయుడు,దావన్ పల్లి రమేష్,కాశెట్టి శారద,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.