కూకట్ పల్లి జనంసాక్షి
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ ఈనాడు కాలనీ మౌంటెసరి స్కూల్ పక్కన సంజీవ్, ఉపేందర్ లు నూతనంగా ఏర్పాటు చేసిన దోస్తుగాళ్ళు మండి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల యోగానంద్ చేతులమీదుగా దోస్తుగాల్ల మండిని ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ కస్టమర్లకు పరిశుభ్రమైన, రుచికరమైన, అరేబియన్ వంటకాలను కస్టమర్లకు అందించి దోస్తుగాళ్ళ మండి కస్టమర్ల మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు చౌదరి ధర్మారావు, రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, మిత్రులు శ్రేయోభిలాషులు, పాల్గొనడం జరిగింది.*




