దౌల్తాబాద్ లో బంద్ ప్రశాంతం
దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం రోజున భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ దౌల్తాబాద్ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛంద బందుకు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు,వాణిజ్య సంస్థలు, స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ఏకకంఠంతో రాజాసింగ్ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేని పక్షంలో ప్రతి ఒక్కరు ఒక రాజసింగుల తయారవుతారని కేటీఆర్ లాంటి మంత్రులు హిందువులను రెచ్చగొట్టే చర్యలు చేస్తూ మతతత్వ ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను బలి చేస్తున్నారని రాబోయే కాలంలో ఈ విధానాన్ని మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు.బేసరత్తుగా టైగర్ రాజాసింగ్ విడుదల చేయడంతో పాటు అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని హిందూ సంఘాల నాయకుడు రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు కృష్ణంరాజు, స్వామి గౌడ్,వేణు,మణికంఠ,నరేష్, ఆంజనేయులు,నాగరాజు, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.