జాహిరబాద్ ఆగస్టు 24( జనంసాక్షి)ధరణి మూలంగా నిలిపి వేసిన రైతులందరికీ పట్టా పాస్ బుక్స్ ఇవ్వాలి.
అని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. రాంచందర్. మాట్లాడుతూ ధరణి వచ్చిన తరువాత ధరణి ప్రజలకు తిప్పలు గా మారిందని ధరణి మూలంగా ఏర్పడిన ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూశాఖ, రాష్ట్ర ప్రభుత్వం గోరంగా విఫలం అయిందని అన్నారు. భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్, ఆర్.డి.ఓ. ల వద్దకు రైతులు వెళితే ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోమని చేతులు ఎతెస్తున్నారు, ఆన్ లైన్ దరఖాస్తులను కలెక్టర్ రిజక్ట్ కోతుతున్నారు రైతులు ఎవరికి అడగాలని ప్రశ్నించారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఆర్డీవో లకు పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి చిన్న సమస్య కు ఆన్ లైన్ పరిష్కారం వద్దు అన్నారు. తరతరాల నుండి పట్టా పాస్ బుక్స్ ఉన్న రైతులకు కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా వక్స్, పారెస్టు భూమూల పేరుతో పాస్ బుక్స్ నిలిపి వేయడం కంటే అన్యాయం ఏముందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నది రైతు బంధు రద్దు, రైతు బీమా రద్దు,బ్యాంకులో లోన్ రద్దు,పండిన పంటకు కొనుగోలు జరగద్దు, భూములను అమ్ముకొనుటకు లేదన్నారు. మరి రైతు ఏ విదంగా తట్టుకుంటాడాని ప్రభుత్వాన్ని నిలదీసినాడు. ప్రభుత్వం వెంటనే రైతులకు పాస్ బుక్స్ ఇచ్చి ఆదుకోవాలని కొరినారు లేని పక్షంలో రైతుల అగ్ర హానికి గురి కావలిసి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు అనివిరప్ప, చంద్రన్న,మల్లేశం,రాజీ రెడ్డి,ప్రకాష్,మచెందర్, జగన్,తదితరులు పాల్గొన్నారు.




