ధర్మపురి కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన దసరా కోలాట సంబరాలు
ధర్మపురి సెప్టెంబర్ 22 ( జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లా ధర్మపురి లో ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ధర్మపురి నియోజకవర్గంలో తెరాస పార్టీ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా దసరా కోలాటం సంబరాలను ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత,ఎల్.యం.కొప్పుల చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత మాట్లాడుతూ,ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు, నియోజకవర్గ మహిళల సహాకారంతో నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా కోలాట సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మొత్తం 126 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని అన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు కొప్పుల స్నేహలత చెప్పారు.
మొదటి బహుమతిగా 50 వేల రూపాయలు. రెండవ బహుమతిగా 30 వేలు. మూడవ బహుమతి గా 20 వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అంద చేస్తామన్నారు. ఈనెల 29 వ తేదీన దసరా కోలాట సంబరాలు వేడుకల ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ముగింపు వేడుక కార్యక్రమానికి ఎమ్మెల్సీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్యతిధిగా హాజరవుతారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ లు, యంపిపి లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, తెలంగాణ జాగృతి సభ్యులు. పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.