ధర్మపురి నియోజకవర్గంలో చర్చీల మరమ్మత్తుకు 96 లక్షల 60 వేల రూపాయల నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న క్రైస్తవ పాస్టర్లు.

ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో చర్చీల రిపేర్లు కు 96 లక్షల 60 వేల రూపాయల నిధులు మంజూరు అయినట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట,‌ క్రిస్టియన్ లు కొలిచే, వారి ఆరాధ్య దైవం అయినట్టువంటి ఏసు ప్రభువుని ప్రతినిత్యం ప్రార్థన చేసుకునేందుకు గాను నియోజకవర్గంలో మండలం, గ్రామాల్లో ఉన్న ప్రార్థన మందిరాలు మరమ్మత్తు ల ముఖ్యమంత్రి కెసిఆర్ నిధులు మంజూరు చేయడం జరిగింది
రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్‌ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

తాజావార్తలు