ధర్మపురి మండల కేంద్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సందర్శించిన గజ్జల స్వామి..
ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల స్వామి వివిధ గ్రామాలను సందర్శించి, వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు అపార నష్టం సంభవించింది.జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రము లో వివిధ గ్రామాలకు అనుసంధానం చేసే ప్రధాన రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. దాంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల స్వామి డిమాండ్ చేశారు,తదనంతరం ధర్మపురి పట్టణ కేంద్రంలో రెండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయిన నిరుపేద కుటుంబాలకు ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి నిరుపేద కుటుంబాలకు అన్యాయం చేస్తున్న e ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పేద కుటుంబాలకు అర్హులైన వారందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజ్జల స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు