పెండింగ్ పనులు పూర్తి చేయాలని వినతి.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 31
మల్కాజిగిరి డివిజన్ లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జలమండలి ఎండి దాన కిషోర్ కు మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేసి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.పాత నేరెడ్ మెట్,ఓల్డ్ మల్కాజిగిరి,కృపా ఆనంద్ అపార్ట్మెంట్,బలరాం నగర్ తదితర ప్రాంతాలలో మంచినీటి పైప్ లైన్, భూగర్భ డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు పంపించామని వాటిని తక్షణమే మంజూరు చేసి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరామని అన్నారు. సానుకూలంగా స్పందించి నాయన అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బలరాం నగర్ అసోసియేషన్ అధ్యక్షులు నెల్సన్,జనరల్ సెక్రెటరీ అద్వట్ కుమార్, నందు యాదవ్,రవి తదితరులు పాల్గొన్నారు.