ధారూర్ మండల పరిధిలో నుండి వికారాబాద్ మండల పరిధిలోకి మార్చాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

 

ఈరోజు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ హోంశాఖ మాత్యులు గౌరవ “మహమూద్ ఆలీ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు, రాళ్లచిట్టెంపల్లి, సర్పన్ పల్లి, గోధుమగూడ మరియు జైదుపల్లి గ్రామాల రెవిన్యూ విభాగాన్ని ధారూర్ మండలం నుండి వికారాబాద్ మండలంలో కలపడం జరిగిందని, రెవెన్యూ మాదిరిగానే ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుండి వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ గ్రామాలను మార్చాలని, మెమోరాండం ఇవ్వడం జరిగింది.

ఎమ్మెల్యే గారి వినతికి హోంమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.