నంగునూరు తెరాస నుంచి బిజెపిలో చేరికలు

నంగునూరు,సెప్టెంబర్20(జనంసాక్షి):
నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గ్రామం నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ యువత నిన్న హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. గోవిందరాం సుధాకర్, పరమాండ్ల ప్రశాంత్, గౌరబోయిన నవీన్, సంజయ్ రాజు, అనిల్, మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీలో యువతకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యసాగర్, జిల్లా కార్యదర్శి యాదమల్లు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, మండల అధికార ప్రతినిధి రమేష్, మండల ఓబీసీ అధ్యక్షుడు సత్తయ్య, బీజేవైఎం అధ్యక్షుడు సురేందర్, దళిత మోర్చా అధ్యక్షుడు రాజలింగం, గ్రామ అధ్యక్షుడు రమేష్, నాయకులు సందీప్, రవి, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
Attachments area