హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): నదులను కాపాడాలంటూ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ర్యాలీ ఫర్ రివర్ పేరుతో శుక్రవారం చేసిన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పబ్లిక్ కు అవగాహన కల్పించారు. నదులను పట్టించుకోకపోతే భవిష్యత్ తరాలకు కష్టాలు తప్పవని నిర్వాహకులు అన్నారు. ఈ సందర్భంగా నదుల రక్షణ ? భారత్ సంరక్షణ అని విద్యార్థులు ప్రచారం నిర్వహించారు.




