జనం సాక్షి: నర్సంపేట
నర్సంపేట పట్టణ కేంద్రంలో విశ్రాంతి భవన ప్రధాన కూడలిలో తెరాస పార్టీ ఎస్.సి సెల్ డివిజన్ అధ్యక్షులు కల్లేపెల్లి సురేష్ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం స్థానిక ఎస్.ఐ బొజ్జ రవీందర్ పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెక్కొండ మండల తెరాస పార్టీ ఎస్.సి సెల్ అధ్యక్షులు ఈదునూరి రమేష్ సురేష్ నీ శాలువాతో సత్కరించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పాఠాన్ని బహూకరించి అనంతరం సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కళ్లేపెల్లి సురేష్ విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాలు చేస్తు తనదైన శైలిలో అలుపెరగని పోరాటాలు చేసి సమాజంలో మంచి ప్రజా నాయకునిగా చెరగని ముద్ర వేసుకున్నారు. తన జీవితం సమాజసేవ కోసం అంకితం చేసిన మహానుభావుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఉద్యమ సమయంలో అనునిత్యం అనేకరకాల పోరాట కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ప్రభావితం చేసి వారిని చైతన్య పరిచి సామాన్యులను సైతం తెలంగాణ ఉద్యమ బాట పట్టించిన నిస్వార్థ తెలంగాణ ఉద్యమకారుడు. నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వములో భ్రమ్మండంగా పనిచేస్తూ వారి అడుగుజాడల్లో పయనిస్తూ ముఖ్య అనుచరుడిగా, మంచి శిశ్యుడిగా ప్రశంసలు పొందుతూ డివిజన్ లోనీ దళితులకు అనేకరకాల తన అమూల్యమైన సేవలను అందిస్తు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పడు మడమ తిప్పడ. అన్న అంటే నేనున్నాను అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తూన్నాడు, మూడు చక్రాల బండి నడపనిదే మూడు పూటలా భోజనం చేయలేని స్థితిలో ఉన్న నేటి ఆటో డ్రైవర్స్ కార్మికుల కుటుంబాలకు అండగా ఉండి వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటి ఎన్నో రకాల సౌకర్యాలు కల్పించి ఎనలేని సేవలు చేస్తూ వారిని ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ తాడు ఆధ్వర్యంలో ప్రతిఒక్క కార్మిక కుటుంబానికి బాసటగా నిలిచి వారి సదకబాదకాల్లో బాగం పంచుకుంటూ ఎల్లపుడూ వారికి తోడునీడగా ఉంటూ పార్టి ఇచ్చిన బాధ్యత నిమిత్తం తెరాస పార్టీ ఎస్.సి సెల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా అనేక రకాల ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేస్తూ దళితులను, ప్రజలను ప్రభావితం చేస్తూ తెరాస పార్టీ వైపు అడుగులు వేయిస్తున్న నేటి కాలపు ఆదర్శ నాయకుడు మన కల్లేపెల్లి సురేశ్ అంటూ వారిని ఈ సందర్భంగా కొనియాడారు.
కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ గట్టి శ్రీలత, డాక్టర్ కిరణ్, ఎన్.జీ.ఓ చైర్మన్ కల్లేపు శోభారాణి, తాడు టౌన్ అధ్యక్షులు ఇస్రం కుమార్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఉపా అధ్యక్షులు సురేందర్ రావు, ఉపేందర్, టౌన్ ఇంచర్జ్ కొమ్ము వినయ్, ప్రముఖ కవి గాయకుడు తాళ్ళ సునీల్, తాడు నాయకులు రాహుల్, ఏం.శంకర్, తదితరుల పాల్గొన్నారు.




