నల్గొండకు తాగే నీరివ్వాండి : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కృష్ణడెల్టాకు నాగార్జున సాగర్‌ నుండి సాగు నీటి విడుదలను ఆపి ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న నల్గొండ జిల్లాకు తాగు నీరు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటిఆర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి కూడా కృష్ణడెల్టాకు రాత్రిపూట నాలుగు టీఎంసీలు వదులుతున్నారని ఆరోపించారు. జాతీయ ఫ్లోరైడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును చేయాలని అన్నారు.