నల్లబ్యాడ్జీలతో హాజరైన సచివాలయ తెలంగాణ ఉద్యోగులు
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు కొందరు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. కొందరు నేతలు నల్ల టోపీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కోసం ఎలాంటి ఆందోళనలు చేయడానికైనా తాము సిద్ధంగా ఉంటామని వారు ప్రకటించారు.



