నల్లమలలో విరిగిపడ్డ కొండచరియలు

నాగర్‌ కర్నూల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): నల్లమల అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పాతాళ గంగా వద్ద వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమ్రాబాద్‌ మండలంలోనూ వర్షం కురుస్తుంది.

——-