నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుల వినతి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 31,(జనంసాక్షి) అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో భారీగా వరదలు వచ్చి ఎన్నో చెరువులకు గండ్లు పడడంతో పాటు మత్తడి దుంకడంతో పొలాల్లో ఇసుక మేటలు వేసాయని తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందని ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఈదుల చెరువు బాధితులకు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు