నాగపూర్ లో 20 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన  శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి

 

నారాయణఖేడ్ జులై24 (జనంసాక్షి)

నారాయణఖేడ్ మండలం నాగపూర్ తండా గ్రామపంచాయతిలో ఆదివారం ఎస్టీప్

నిధులతో రూ 20 లక్షలతో నిర్మించ డానికి సీసీ రోడ్డు , మురికి కాలువల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించిన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, ఎంపీపీ తనయుడు రమేష్ చౌహన్, గ్రామ సర్పంచ్ పుండ్లిక్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.