ఎల్బీ నగర్( జనం సాక్షి )చంపాపేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రోజా రెడ్డి ఒ దిన పత్రిక కో ఆర్డినేటర్ పూల నాగరాజు సీనియర్ జర్నలిస్ట్, పై ఫోన్ లో అనుచత వ్యాఖ్యలు చేసినందుకు డివిజన్ నాయకులు అందరూ ఖండించి నాగరాజు కి బహిరంగ క్షమాపణ చెప్పాలని చంపాపేట్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనసూయ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం చంపాపేట డివిజన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంపాపేట్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనసూయ గౌడ్ , చంపాపేట్ డివిజన్ బిసి సెల్ ప్రెసిడెంట్ గోపాల్ ముదిరాజు డివిజన్ మహిళా విభాగం కార్యదర్శి బీ ఉషా , చంపాపేట్ డివిజన్ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి , మాజీ ఏరియా కమిటీ సభ్యులు టిల్లు యాదవ్ పర్వతాలు పాల్గొని మాట్లాడుతూ విలేకరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు,ఆమె అహంకార ధోరణి తో వ్యవహారిస్తున్నారని అన్నారు , అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజి రెడ్డి ‘ సీనియర్ నాయకులు సమన్వయం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు . ఇలాంటి సంఘటనలు జరిగితే రాబోయే కాలంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది రేపు జరగబోయే పరిణామాలకు డివిజన్ అధ్యక్షులు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు . డివిజన్ అధ్యక్షుడు సమన్వయం చేయకుండా కేవలం డివిజన్ అధ్యక్షుడు మహిళా అధ్యక్షురాలు ఇద్దరు మాత్రమే డివిజన్లో ఎదగాలని వారు మేము అన్నట్టుగా వ్యవహారాలను నడిపిస్తున్నారని ఆరోపించారు . మరి కార్యకర్తలు అందరు కూడా పైకి చెప్పలేక పోతున్నారని ఇదె విషయం మేము తెలియపరుస్తున్నామని మీరు వైఖరిని మార్చుకుని డివిజన్ లో ప్రతి కార్యకర్త ను అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతేనే మనుగడ ఉంటుంది లేదంటే రేపు రాబోయే ఎన్నికల్లో చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామము మరి దీనికి పూర్తి బాధ్యత డివిజన్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు . ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి నాగరాజుకు క్షమాపణ చెప్పాలని లేని యెడల తమ ఇండ్లను ముట్టడించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు \
నాగరాజు కి రోజా రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి : చంపాపేట్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనసూయ గౌడ్




